వైసీపీ బౌన్స్ బ్యాక్ అయిందా?.. ఏపీ పాలిటిక్స్‌లో మారుతున్న అంచనాలు!

34చూసినవారు
వైసీపీ బౌన్స్ బ్యాక్ అయిందా?.. ఏపీ పాలిటిక్స్‌లో మారుతున్న అంచనాలు!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మళ్లీ కేడర్‌ను చైతన్యపరిచే దిశగా అడుగులు వేస్తోంది. వరుస కార్యక్రమాలు, నిరసనలతో కార్యకర్తలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీకి పునరోత్తేజం తీసుకురావడంలో జగన్ కొంతవరకు సఫలమయ్యారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. “వెన్నుపోటుకు రెండేళ్లు” వంటి కార్యక్రమాల ద్వారా కేడర్‌ను మళ్లీ యాక్టివ్ చేయగలిగారని చెబుతున్నారు. అయితే కేడర్ బలోపేతం కావడం ఒక దశ మాత్రమేనని, ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా తమవైపు తిప్పుకోవడం, భవిష్యత్ ఎన్నికల్లో విజయంగా మలచుకోవడం ఇంకా పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్