బాలకృష్ణ ఏం మాట్లాడారో మరిచిపోయారా?: అంబటి

60చూసినవారు
బాలకృష్ణ ఏం మాట్లాడారో మరిచిపోయారా?: అంబటి
AP: వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో కూటమి ప్రభుత్వం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు. అంత మాత్రానికి దాడులు చేస్తారా? గతంలో బాలకృష్ణ చేసేందేమిటి? అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్‌ను ఆయన సైకో అనలేదా? అసెంబ్లీకి తాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. అప్పుడు ఏం మాట్లాడారో మరిచిపోయారా?’ అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్