AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13 లక్షల మంది రిజిస్టర్ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వీరు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా రూ.20 వేలు) నిధులు పొందలేరని అధికారులు వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.