అమెరికా వ్యాప్తంగా కొనసాగుతున్న అతి శీతల వాతావరణం, మంచు తుఫాను కారణంగా ప్రఖ్యాత నయాగరా జలపాతం గడ్డకట్టింది. పోలార్ వోర్టెక్స్ వద్ద ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గడ్డకట్టినప్పటికీ, ప్రతి సెకనుకు లక్షలాది లీటర్ల నీరు అంచుల నుంచి ఉప్పొంగుతూనే ఉంది. ఈ అద్భుత దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి, నెటిజన్లు దీనిని 'వింటర్ వండర్ ల్యాండ్' గా అభివర్ణిస్తున్నారు.