AP: మంత్రి సవిత ఇలాకాలో హవాలా దోపిడీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండలో హవాలా దోపిడీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు దాడులు నిర్వహించారు. హవాలా డబ్బు తీసుకెళ్తున్న కారును వెంబడించి దుండగులు కాజేశారు. వారి నుంచి రూ.1.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ వివరాలను పుట్టపర్తి ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.