పెళ్లికి అతిథిగా వచ్చాడు.. క్షణాల్లో బ్యాగ్‌ తీసుకుని పరారయ్యాడు(వీడియో)

9183చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని ‘రాయల్ అంబియన్స్ బ్యాంకెట్ హాల్’లో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు అతిథిగా వచ్చిన ఓ యువకుడు క్షణాల్లో నగల బ్యాగ్‌ తీసుకుని పరారయ్యాడు. వేడుక జరుగుతుండగా వరుడి తల్లి మున్నీ మిశ్రా తన వెనకాలే టేబుల్‌పై బ్యాగ్ పెట్టి.. అతిథులతో మాట్లాడుతోంది. అప్పుడే ఓ కుర్రాడు అక్కడికి వచ్చి ఆ బ్యాగ్ తీసుకొని సైలెంట్‌గా పారిపోయాడు. ఆ బ్యాగ్‌లో రూ.1 లక్షకు పైగా నగదు, 2 తులాల బంగారం ఉన్నట్టు బాధిత కుటుంబం తెలిపింది. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్