తండ్రిని గదిలో బంధించి తల్లి గొంతు కోశాడు

89చూసినవారు
తండ్రిని గదిలో బంధించి తల్లి గొంతు కోశాడు
AP: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లి లక్ష్మీదేవిని ఆమె కుమారుడు యశ్వంత్‌రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. ఆదివారం ఉదయం శ్రీరామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. మందలించినందుకు ఆగ్రహించిన యశ్వంత్‌ తండ్రిని గదిలో బంధించి, తల్లిని గొంతుకోసి చంపాడు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నిందితుడు బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.  అయితే యశ్వంత్‌ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్