ఎండకాలంలో పండ్ల రసాలతో ఆరోగ్యానికి మేలు: నిపుణులు

6243చూసినవారు
ఎండకాలంలో పండ్ల రసాలతో ఆరోగ్యానికి మేలు: నిపుణులు
ఎండకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలు సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఖరీదైన పండ్ల రసాలను ఇతర కూరగాయల రసాలతో కలిపి తాగడం వల్ల ఖర్చు తగ్గి, పోషకాలు పెరుగుతాయి. పైనాపిల్ రసంలో చెరుకు రసం, దానిమ్మ రసంలో క్యారెట్ రసం, బత్తాయి రసంలో పుచ్చకాయ రసం, కమలా రసంలో ఖర్బూజా రసం కలపడం వల్ల రుచి, పోషకాలు మెరుగుపడతాయి. ఇంట్లో తయారుచేసుకునే పండ్ల రసాలలో ఐస్, చక్కెర, పాలు కలపకూడదని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్