మాకు ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం: పయ్యావుల (వీడియో)

17162చూసినవారు
AP: తమకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం బయట పెట్టిందే మా ప్రభుత్వం. వాళ్ళని శిక్షిస్తుంది మా ప్రభుత్వం. 5 ఏళ్ళ పాటు జే-బ్రాండ్స్‌తో వేల మంది ప్రాణాలు తీసిన మీరా మద్యం గురించి లెక్చర్లు ఇచ్చేది? మీ ప్రభుత్వంలో కల్తీ మద్యంతో ప్రాణాలు పోతే కనీసం FIR కూడా బుక్ చేయలేదు. ఇవాళ ఏమో మద్యం మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు’ అంటూ వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్