వర్షాకాలంలో ఆరోగ్యానికి ముప్పు.. జాగ్రత్త అవసరం: నిపుణులు

4062చూసినవారు
వర్షాకాలంలో ఆరోగ్యానికి ముప్పు.. జాగ్రత్త అవసరం: నిపుణులు
వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో పరిశుభ్రత, ఆహారం, నీరు, పరిసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి శుభ్రమైన ఆహారం, మరిగించిన నీరు తీసుకోవడం, వీధి ఆహారాలను పూర్తిగా నివారించడం, ఆకుకూరలు, కూరగాయలను శుభ్రంగా కడిగి వండుకోవడం, తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం, చేదు కూరగాయలు, పండ్లు తీసుకోవడం మేలు చేస్తుందని తెలిపారు. ఈగల ద్వారా వ్యాపించే టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించడానికి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్