అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా ఇది తోడ్పడుతుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అరటి పువ్వును పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా వండుకోవచ్చు.