వర్షాకాలంలో మజ్జిగతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

7919చూసినవారు
వర్షాకాలంలో మజ్జిగతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
వర్షాకాలంలో మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్ జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలో క్యాల్షియం, విటమిన్ B కాంప్లెక్స్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వర్షాకాలంలో మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం లేదా రాత్రి తాగితే కఫం పెరిగి జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి మజ్జిగ తాగకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్