ప్రతి ఏడాది జూన్ 3న నిర్వహించే ‘నేషనల్ ఎగ్ డే’ సందర్భంగా గుడ్డు ఆరోగ్య ప్రయోజనాలపై చర్చ జరుగుతోంది. ఒక ఉడకబెట్టిన గుడ్డులో సుమారు 75 కేలరీలతో పాటు అధిక నాణ్యత గల ప్రోటీన్, 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి అవసరమైన కోలిన్, కంటి సంరక్షణకు తోడ్పడే ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. గుడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచవని, మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యవంతులు రోజుకు 1-2 గుడ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.