AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఏసీబీ కోర్టు విచారణను ఈ నెల 12న వాయిదా వేసింది. అలాగే చాణక్య బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 11కి విచారణ వాయిదా వేసింది. కాగా, లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది.