రాజ్‌కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

138చూసినవారు
రాజ్‌కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
AP: లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్ కేసిరెడ్డి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. మరోవైపు, ఈ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులైన వాసుదేవ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Job Suitcase

Jobs near you