దిల్లీలో పెరిగిన గుండెపోటు మరణాలు

7470చూసినవారు
దిల్లీలో పెరిగిన గుండెపోటు మరణాలు
దిల్లీలో గుండెపోటు, హృదయ సంబంధ రుగ్మతల కారణంగా మరణాలు గత ఏడాదిలో 50% పెరిగాయి. 2023లో 22,385 మంది మరణించగా, 2024లో సంఖ్య 34,539కి చేరింది. గడచిన 20 ఏళ్లలో మొత్తం 3,29,857 మంది హృదయ రుగ్మతల కారణంగా మరణించారు. అత్యధిక మరణాలు 45–64 ఏళ్ల వయస్సు వారిలో (1,03,972) సంభవించగా, 65 ఏళ్ల పైవారిలో 92,048 మంది, 25–44 ఏళ్లలో 46,129 మంది మరణించారు. 14 ఏళ్ల లోపు 14,321 మంది మరణించారు. ఆధునిక జీవనశైలి, ధూమపానం, తక్కువ శారీరక శ్రమ, వాయు కాలుష్యం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్