వేసవిలో వడగాలుల తీవ్రత పెరిగి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. వృద్ధులు, పిల్లల్లో మరణాల ముప్పుతో పాటు మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. తరచుగా నీరు తాగడం, మధ్యాహ్నం బయట తిరగకపోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం, కాఫీ, మద్యం తగ్గించి జ్యూసులు, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, పండ్లు, కూరగాయలు తినడం, కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.