AP: అనకాపల్లి జిల్లాలో 'మొంథా' తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వరదలకు ఒక బ్రిడ్జి కొట్టుకుపోయింది. చోడవరం - పాడేరు మధ్యలోని విజయరామరాజుపేట వద్ద గల బ్రిడ్జి వరద ఉధృతికి దెబ్బతిని కొట్టుకుపోయింది. అక్కడ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చోడవరం నుండి వడ్డాది, నర్సీపట్నం, మాడుగుల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.