AP: ఉత్తర ఆంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు సహా మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈదురు గాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి, ప్రజలు చెట్ల కింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.