AP: రోహిణి కార్తె ప్రారంభానికి ముందే రాష్ట్రంలోని పలు చోట్ల అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అయితే తాజాగా వాతావరణ కేంద్ర అధికారులు ఏపీలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.