ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్‌ఎస్ కాలనీలో నీటిలో పడి ముగ్గురు మృతి చెందారు. అలాగే మున్సిపల్ పార్క్ వద్ద స్కూల్ ఆటో వర్షపు నీటిలో మునిగిపోయింది. ఇందులో 7 మంది విద్యార్థులు కొట్టుకుపోగా.. స్థానికులు కాపాడారు. ఓ బాలిక మాత్రం కాలువలో గల్లంతైంది. గల్లంతైన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.