ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.