AP: తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గోదావరి నది, వట్టిగెడ్డ జలాశయం, పెళ్లిరేవు వాగు, కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ఎర్రంపాడు వద్ద వట్టిగెడ్డ జలాశయం కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద పెళ్లిరేవు వాగు, దేవీపట్నం మండలం పజిల్లాబాద్ వద్ద కొండవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండవాగు ఉధృతి కారణంగా మన్యం ప్రాంతం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.