AP: నెల్లూరులో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో రోడ్లు పూర్తిగా జలమయమై, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.