AP: పోలవరం జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. రంపచోడవరం-రంప గ్రామాల మధ్య సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూపతిపాలెం రిజర్వాయర్ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో చప్టాపై వరద పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద ఉధృతి కారణంగా సుమారు 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.