తొలి రోజు అమర్నాథ్ యాత్రలో భారీ వర్షం

13759చూసినవారు
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన మొదటిరోజే భారీ వర్షం కురిసింది. దీని వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండ మార్గాలు జారుడుగా మారడంతో యాత్రికులు పైకి వెళ్ళడానికి అవస్థలు పడ్డారు. ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా భక్తులు మంచు లింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. భద్రతా బలగాలు, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సహాయం అందిస్తున్నాయి. అధికారులు యాత్రికులకు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్