కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాతి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. నందవరానికి చెందిన బలుదూరు లక్ష్మీదేవి తన ఇద్దరు కుమారులు నాగరాజు(45), రాజు(39), మనవడు లక్ష్మీనరసింహ(14)తో కలసి దేవాలయం స్థలంలో రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. అర్ధరాత్రి గోడ కూలడంతో తండ్రి నాగరాజు, కుమారుడు లక్ష్మీనరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.