AP: తిరుపతిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిడుగుల శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉ.గోదావరి, గుంటూరు, బాపట్ల, ఏలూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.