AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పల్నాడు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.