భారీ వర్షాలు.. 32 గ్రామాలకు రాకపోకలు బంద్

554చూసినవారు
భారీ వర్షాలు.. 32 గ్రామాలకు రాకపోకలు బంద్
AP: అల్లూరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా డి. అగ్రహారం ప్రాంతంలో ఒక వంతెన కొట్టుకుపోయింది. దీంతో సుమారు 32 గ్రామాలకు రహదారి సంబంధాలు తెగిపోయాయి. మాడిగమల్ల-చోడిరాయి వంతెనల వద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోనూ వేలాది ఎకరాల వరి పొలాలు నీట మునిగి, జనజీవనం అస్తవ్యస్తమైంది. గోపాలపురంలో 1,000 ఎకరాల వ్యవసాయ భూమి, పెద్దాపురం శివార్లలో 200 ఎకరాల వరి పంట నీట మునిగాయి. రాజమహేంద్రవరం తహసీల్దార్ కార్యాలయంలోకి డ్రైనేజీ నీరు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్