ముంబైలో మళ్లీ భారీ వర్షం.. అంధేరీ సబ్‌వే మూసివేత

528చూసినవారు
ముంబైలో మళ్లీ భారీ వర్షం.. అంధేరీ సబ్‌వే మూసివేత
మహారాష్ట్ర రాజధాని ముంబై, శివారు ప్రాంతాలు ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో జలమయమయ్యాయి. కేవలం నాలుగు గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంధేరి సబ్‌వే పూర్తిగా నీట మునగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారత వాతావరణ శాఖ ముంబై, సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉరుములతో కూడిన మెరుపులు, మోస్తరు వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్