వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం ఇది బాలాసోర్‌కు 50 కి.మీ, చాంద్‌బలి, దిఘాలకు 60 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది.