ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. 80 శాతం పైగా రిజర్వాయర్లు నిండిపోయాయి. ఇప్పటికే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నుంచి 310 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చింది. హంద్రీనీవా ద్వారా రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు. హంద్రీనీవా కాల్వల విస్తరణతో కృష్ణా నది నీటిని ఇటీవల కుప్పంకు తరలించారు. పలు ప్రాజెక్టులకు ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది.