భారీ వర్షాలతో శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం

9009చూసినవారు
భారీ వర్షాలతో శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం
TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, అధికారులు ముంబయి, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్‌ల నుంచి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని, దీంతో కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారని అధికారులు తెలిపారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్