ఏపీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్ర, శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.