AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పోలవరం జిల్లాల్లో స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని సూచించారు. కాగా, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.