AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి, అల్లూరి, విశాఖ, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.