AP: తీవ్రవాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ గురువారం సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను పాఠశాలల యజమాన్యాలు కచ్చితంగా అమలు చేసేలా డీఈవో, ఎంఈవోలు, డిప్యూటీ ఎంఈవోలు పర్యవేక్షించాలన్నారు.