ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

22చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్