ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉరుములతో కూడిన మెరుపులు, గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది.