ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

0చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటడంతో, ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్టీఆర్, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో ఈ రెడ్ అలర్ట్ వర్తిస్తుంది. ప్రజలు బయటకు వెళ్లవద్దని, పొలాల్లో చెట్ల కింద ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్