AP: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర కోస్తా నుంచి ఒడిశా వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.