చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు

34చూసినవారు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
AP: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దాంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్