కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

25522చూసినవారు
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. నవంబర్ 28న గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్