AP: తూర్పుగోదావరి జిల్లాలో ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ‘అర్నబ్’ తుఫాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే ఈ వర్షాలు కురవడంతో, కోతకు సిద్ధంగా ఉన్న ఖరీఫ్ వరి పంట నీట మునిగింది. వరి పనలు తడిసిపోయి ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి తమను ఆదుకోవాలని, చేతికొచ్చిన పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.