మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్‌లోని హిందూ కాలనీ పరిసరాల్లో రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అన్ని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.