ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే 'స్పైడర్ మ్యాన్' కాస్ట్యూమ్ వేసుకున్న ఒక వ్యక్తి రోడ్డుపై ప్రజలకు సహాయం చేస్తూ ఆకట్టుకున్నాడు. మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ స్పైడర్ మ్యాన్ అవతారంలో ఉండి దారి చూపిస్తూ పలువురికి సాయం చేశాడు.