AP: ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ఉదయం 5.30 గంటల వరకు విశాఖపట్నంలో 180 మి.మీ., వాల్తేరులో ఏకంగా 242 మి.మీ. వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం కదులుతుండటంతో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై, కళింగపట్నానికి నైరుతి వైపు వాయుగుండం ప్రభావం చూపుతోంది.