కుండపోత వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. దాదార్, అంధేరి వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో జనజీవనం స్తంభించింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఈ క్రమంలోనే వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జూలై 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది.