పలు జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు(VIDEO)

7చూసినవారు
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కంచికచర్ల, బాపట్ల జిల్లా చెరుకుపల్లి, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిక మేరకు ఇవాళ (గురువారం) శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్